బైడెన్‌ వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఖాయం: ట్రంప్‌

Published on Mon, 08/26/2024 - 07:41

ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మధ్య చోటు చేసుకున్న మిసైల్స్‌, రాకెట్ల​ దాడులు మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్  ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న నేతలు నిద్రలో పోతుండటం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయని, ఇలా కొనాసాగితే మూడో ప్రపంచం యుద్ధం రావటం ఖాయమని ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

‘మధ్యప్రాచ్యంలో దాడులు జరగకుండా ఎవరు చర్చలు జరుపుతున్నారు? అక్కడ బాంబులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ కాలిఫోర్నియాలోని బీచ్‌లో నిద్రిస్తున్నాడు. ఆయన డెమోక్రాట్‌లచే దుర్మార్గంగా బహిష్కరించబడ్డారు. కామ్రేడ్ కమల తన ప్రచారం బృందంతో బస్సు యాత్ర చేస్తోంది. కమల రన్నింగ్‌ మేట్‌ టిమ్‌ వాల్జ్‌ ఒక చెడ్డ ఎంపిక. సరైన వాళ్లును ఎంచుకోండి. మూడో ప్రపంచ యుద్ధం మనకు వద్దు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము’ అని ట్రంప్‌  విమర్శలు చేశారు.

 

మధ్యప్రాచ్యంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలను నిలువరించటంపై అమెరికా నాయకత్వంపై పలు సందేహాలను కలుగుతున్నాయని అన్నారు. సంఘర్షణకు దారితీసే ఉద్రిక్తతల తీవ్రతలను నివారించే మార్గాలను చర్చించడానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సిక్యూ బ్రౌన్.. మిడిల్ ఈస్ట్‌లో అనూహ్య పర్యటన తర్వాత ఈ దాడులు జరగటం గమనార్హం.

ఆదివారం లెబనాన్‌ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం మిసైల్స్‌తో దాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఈ ముందస్తు దాడులను చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సుమారు 40 మిసైల్స్‌ను  ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై ప్రయోగించింది.అయితే ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా వెంటనే  స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ  దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)