Breaking News

భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

Published on Wed, 07/30/2025 - 08:13

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్‌ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్‌ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్‌పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్‌ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై​ చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్‌ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.

రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్​ 2 తుది గడువు​ పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్​  ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్​, యూరోపియన్​ యూనియన్​, జపాన్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)