నాలుగు వారాల్లో జిన్‌పింగ్‌ను కలుస్తా: ట్రంప్‌ ప్రకటన

Published on Thu, 10/02/2025 - 07:36

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్‌ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్‌ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌తో భేటీపై ఆసక్తి నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్‌ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్‌ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్‌ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్‌పింగ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్‌పింగ్‌ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. 

 

మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (అపెక్‌) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్‌టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్‌టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)