Breaking News

పుతిన్‌ నివాసాన్ని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకోలేదు

Published on Tue, 01/06/2026 - 06:02

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చెందిన నివాసంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి దిగిందంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. పుతిన్‌ నివాసానికి సమీపంలో ఏదో జరిగిందని, అయితే అది పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని తమ అధికారులు చెప్పారన్నారు. 

ఫ్లోరిడాలోని మార్‌ ఎ లాగో నివాసంలో రెండు వారాల విశ్రాంతి ముగించుకున్న ట్రంప్‌ సోమవారం వాషింగ్టన్‌కు వస్తూ తన  ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడారు.

 ‘మొదట్లో ఉక్రెయిన్‌ దాడి విషయం మేం కూడా నమ్మాం. కానీ, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని నిర్ధారణ అయింది’అని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ ప్రతిపాదిత రష్యా–ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందంపై అమెరికాలో చర్చలు జరుగుతున్న వేళ..పుతిన్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని, డ్రోన్‌ దాడి జరిగినట్లు చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని సోమవారం ట్రంప్‌ తెలపడం తెల్సిందే. 

అనంతరం, శాంతి చర్చలను తప్పుదోవ పట్టించేందుకే రష్యా ఈ అబద్ధం చెప్పిందటూ న్యూయార్క్‌ పోస్ట్‌లో వచ్చిన కథనాన్ని బుధవారం ఆయన షేర్‌ చేశారు. శాంతి చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్, జెలెన్‌స్కీ ప్రకటించినా రష్యా మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక డోన్బాస్‌ ప్రాంతం మొత్తం తనకే చెందాలని, యుద్ధానంతరం ఆ దేశం పరిమితంగా సైన్యాన్ని ఉంచుకోవాలని షరతులు విధిస్తోంది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)