Breaking News

గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్‌ కార్డు: ట్రంప్‌

Published on Sat, 06/22/2024 - 05:14

వాషింగ్టన్‌: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్‌–ఇన్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌గా గ్రీన్‌ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

గ్రాడ్యుయేషన్‌ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్‌ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్‌కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యరి్థగా ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు