Breaking News

వచ్చే ఏడాది భారత్‌కు

Published on Fri, 11/07/2025 - 07:11

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు ఆహ్వానం పంపారని గురువారం తన ఓవల్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆయన (మోదీ) నా మిత్రుడు. నాతో మాట్లాడినప్పుడు భారత్‌లో పర్యటించాలని కోరారు. అందుకే నేను వెళ్తున్నా. అక్కడ మోదీతో కలిసి నా పర్యటన గొప్పగా ఉండబోతోంది. ఆయన గొప్ప వ్యక్తి. 

బహుషా వచ్చే ఏడాది నా పర్యటన ఉండవచ్చు’అని పేర్కొన్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ సభ్యులుగా ఉన్న క్వాడ్‌ సమ్మిట్‌ త్వరలో భారత్‌లో జరుగనుంది. సదస్సు తేదీలను భారత్‌ ఇంకా ప్రకటించలేదు. 2024లో అమెరికాలోని డెలావేర్‌లో ఈ సదస్సు నిర్వహించారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్‌ ఆపేసిందని ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. ‘ఇది గొప్ప విషయం. 

మంచిగా జరుగుతోంది. అతను (ట్రంప్‌) ఆపేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును చాలావరకు ఆపేశారు’అని పేర్కొన్నారు. భారత్‌– పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు మరోసారి చెప్పుకున్నారు. ‘నేను ఆపిన 8 యుద్ధాల్లో ఐదారు వరకు టారిఫ్‌లు విధిస్తానని బెదిరించి ఆపినవే. అందుకు ఉదాహరణ కూడా ఇస్తా. 

మీరు భారత్‌–పాక్‌ను గమనిస్తే.. వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. పైగా ఆ రెండు అణ్వాయుధ దేశాలు. పరస్పరం 8 యుద్ధ విమానాలు కూల్చేసుకున్నారు. గతంలో లెక్క 7 ఉండేది. ఇప్పుడు 8కి పెరిగింది. వాళ్లకు నేను ఒక్కటే చెప్పి.. మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటే.. మీ ఇద్దరిపై భారీగా పన్నులు విధిస్తానని తెలిపా. దీంతో వాళ్లు వెనక్కు తగ్గి యుద్ధాన్ని విరమించారు. టారిఫ్‌లే లేకుంటే.. నేను ఆ యుద్ధాన్ని ఆపగలిగేవాడిని కాదు’అని ట్రంప్‌ పేర్కొన్నారు.   

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)