Breaking News

ఉక్రెయిన్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 02/11/2025 - 14:49

వాషిం‍గ్టన్‌:రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్‌ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు..కాకపోవచ్చు అని ట్రంప్‌ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో  ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. 

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఉక్రెయిన్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా,సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు.
 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)