Breaking News

ట్రంప్‌ హుకుం.. మూత పడనున్న అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు?

Published on Thu, 12/19/2024 - 08:15

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్‌లు కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ కోసం తాత్కాలికంగా నిధులు కేటాయించే స్టాప్‌గ్యాప్ ఫండింగ్‌ను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.  స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును వ్యతిరేకించాలని యూఎస్‌ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్లకు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ప్రభుత్వ సంస్థల నిర్వహణకు నిధుల కేటాయించడం అసాధ్యం. నిధులు లేకపోతే ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ట్రంప్‌ పాలక వర్గం కసరత్తు చేస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ లోపు స్టాప్‌ గ్యాప్‌ ఫండింగ్‌ బిల్లును నిలిపివేస్తే నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోన్నాయి. ఆ ప్రభావం క్రిస్మస్‌తో పాటు ఇతర ప్రజా సేవలపై ప్రభావం పడనుంది. దీంతో పాటు పలు ప్రభుత్వ సంస్థలు తాత్కాలికంగా మూతపడే అవకాశం ఉంది. విమానయానం,పాస్‌పోర్ట్‌ సేవలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు, ట్రాన్స్‌ఫోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో స్క్రీనర్‌లు పనిచేయవు. ఫలితంగా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఎదురు చూపులు తప్పవు.  

ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుంది. వారందరూ విధులు ఆపేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. నిధులు పునరుద్ధరించబడిన తర్వాత వారికి జీత భత్యాల చెల్లింపులు జరగనున్నాయి. సిబ్బందిని తగ్గించడం వల్ల విమానాలు ఆలస్యం, రద్దు కావచ్చు. కస్టమ్స్, సరిహద్దు రక్షణ వంటి ఇతర విమానాశ్రయ సేవలు కూడా ప్రభావితం కావచ్చు. రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయి. దీంతో పాటు ప్రభుత్వ సేవలు అందించే అన్నీ రంగాలపై దెబ్బ పడనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)