భారత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Wed, 02/19/2025 - 07:33

వాషింగ్టన్‌:భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ఇటీవల అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్‌ మంగళవారం(ఫిబ్రవరి 18) సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇండియాకు 21 మిలియన్‌ డాలర్ల సాయం ఎందుకివ్వాలి. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి. అమెరికాపై వాళ్లు భారీగా పన్నులు వేస్తున్నారు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది’అని ట్రంప్‌ అన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్‌ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు.      

ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన ముగిసిన వెంటనే బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్‌,పాకిస్తాన్‌ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది.

 

 

 

 

 

 

 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)