Breaking News

స్టైòపెండ్‌తో పాటు విమాన టికెట్‌ 

Published on Thu, 04/17/2025 - 05:36

వాషింగ్టన్‌: అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరి ఆవలంబిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్తంత మెత్తబడ్డారు. ‘సెల్ఫ్‌–డిపోర్ట్‌’ఆప్షన్‌ ఎంచుకునే వలసదారులకు విమాన టికెట్లు కొనివ్వడంతోపాటు స్టైఫండ్‌గా కొంత డబ్బు కూడా అందజేయాలనే యోచన ఉన్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఇది అన్ని దేశాల వలసదారులకూ వర్తిస్తుందన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం హంతకులను మాత్రమే దేశం నుంచి పంపించివేస్తున్నామంటూనే ఆయన.. అక్రమంగా ఉంటున్న ఇతరులకు సాయప డేందుకు ‘సెల్ఫ్‌–డిపోర్టేషన్‌ ప్రోగ్రామ్‌’ను అమలు చేయనున్నామన్నారు.

 సొంత దేశాలకు వెళ్లాక వీరిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రంప్‌ జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను నిర్బంధించి, వారిని బలవంతంగా సొంత దేశాలకు పంపిస్తున్న విషయం తెల్సిందే. 

ఇంటర్వ్యూ సందర్భంగా ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ రాచెల్‌ కంపోస్‌–డఫీ మెక్సికో వాసి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ‘నేను ట్రంప్‌కు ఓటేయలేదు. అయినప్పటికీ నా మద్దతు ట్రంప్‌కే. నేరాలకు పాల్పడిన వారిని, నాతో సహా ఎవరినైనా సరే సొంత దేశాలకు పంపించడంలో తప్పులేదు’అని ఆ వ్యక్తి తెలిపాడు. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికా పౌరుడు..భార్య, పిల్లలు కూడా ఉన్నారని యాంకర్‌ డఫీ వివరించారు.

 ఇది చూసిన ట్రంప్‌..తమకు కావల్సింది ఇలాంటి వాళ్లేనన్నారు. అతడికి డిపోర్టేషన్‌ ముప్పు ఉన్నట్లు భావించడం లేదన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయి, తిరిగి చట్టబద్ధంగా అమెరికా రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఆయన వెల్లడించలేదు. 
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)