Breaking News

ట్రంప్‌ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం

Published on Thu, 01/23/2025 - 11:04

వాషింగ్టన్‌: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలో ట్రంప్‌ ఆదేశాల మేరకు స్థానిక చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై  చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా యూఎస్‌ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) న్యూయార్క్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలోని ఫుల్టన్ ప్రాంతంలో నలుగురు బంగ్లాదేశీయులను ఐసీఈ అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ వలసలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుండి అక్రమ వలసదారుల్లో ఆందోళన మొదలయ్యిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.

న్యూయార్క్‌లో బంగ్లాదేశీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లోని వీధులు, రెస్టారెంట్లు ఇప్పుడు దాదాపు  నిర్మానుష్యంగా మారాయని ఆ పత్రిక నివేదించింది. చట్ట అమలు అధికారి ఖాదీజా ముంతాహా రూబా తెలిపిన వివరాల ప్రకారం తగిన ధృవపత్రాలు లేకుండా సంచరిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఇక్కడి బంగ్లాదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చట్ట అమలు సంస్థ సభ్యులు వారిని ప్రశ్నిస్తే వారు సహకరించాలని ముంతాహా రూబా సూచించారు. కాగా గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాకు వస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య మరింతగా పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ఆసియా జాతి సమూహాలలో బంగ్లాదేశీయులు  పెద్దసంఖ్యలో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)