Breaking News

మోదీకి స్పెషల్‌ గిఫ్ట్‌ 

Published on Sat, 02/15/2025 - 05:33

ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని గురువారం వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్‌ ఫొటోలో ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

 ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌! మీరు గ్రేట్‌’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్‌ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్‌ భారత పర్యటన ‘హలో ట్రంప్‌’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్‌మహల్‌ దగ్గర తీసుకున్న ట్రంప్‌ ఫొటో కూడా ఉంది. 

ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్‌ చొరవ, స్పేస్‌ ఫోర్స్‌ ఏర్పాటు, జిన్‌పింగ్, పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్‌ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్‌ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్‌. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)