Breaking News

నవ్వులపాలైన ట్రంప్‌.. స్పీకర్‌ పదవికి పోటీ పడితే ఒకే ఒక్క ఓటు

Published on Sat, 01/07/2023 - 11:21

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌ ఎన్నికపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కెవిన్‌ మెక్‌కార్తీని మూడోరోజు సైతం అదృష్టం పలకరించలేదు. స్పీకర్‌ను ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు మూడు రోజులుగా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తెరపైకి వచ్చి నవ్వులపాలయ్యారు. స్పీకర్‌ పదవి పోటీకి ఆయన పేరును నామినేట్‌ చేయగా.. కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం. మొత్తం 430 మంది సభ్యులన్న ప్రతినిధుల సభలో ఒక్కటే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

స్పీకర్‌గా సేవలందించాలనుకునే వ్యక్తులను సభ ఎన్నుకుటుంది. కాంగ్రెస్‌లో సభ్యులు కాకపోయినా పోటీ పడొచ్చు. ఈ నిబంధన నేపథ్యంలో మెక్‌కార్తీని ప్రత్యర్థి వర్గం డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును నామినేట్‌ చేసింది. అయితే, ఆయనకు ఒకే ఓటు వచ్చింది. ఆ ఒక్క ఓటు సైతం ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ సభ్యుడు మాట్ గేట్జ్ వేశారు. ఆయన మెక్‌కార్తీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 11వ రౌండ్‌ ఓటింగ్‌ నిర్వహించే క్రమంలో ట్రంప్‌ పేరును ఆయన నామినేట్‌ చేశారు. ప్రతినిధుల సభకు ట్రంప్‌ను స్పీకర్‌ని చేయాలన్న కోరికకన్నా.. మెక్‌కార్తీని స్పీకర్‌ కాకుండా చేయాలన్న లక్ష్యమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని సభ్యులు మాట్లాడుకుంటున్నారు. 

ఆశ్చర్యకరంగా ఈ సంఘటనను తనకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్‌ ట్రంప్‌. అధ్యక్షుడు జో బైడెన్‌ను వెనక నుంచి వెక్కిరిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు.. అమెరికాలో తొలి ఓటింగ్‌లోనే స్పీకర్‌ ఎన్నిక ఖరారు కాకపోవడమనేది 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1923లో మసాచుసెట్స్‌కు చెందిన రిపబ్లికన్‌ నేత ఫెడెరిక్‌ గిల్లెట్‌ 9 రౌండ్ల తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్‌ విమర్శలు!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)