Breaking News

ఇక ‘ఏలియన్‌’ ఫైల్స్‌

Published on Sat, 02/21/2026 - 04:16

వాషింగ్టన్‌: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్‌ తాలూకు కలకలం సద్దుమణగకముందే ప్రపంచవ్యాప్తంగా అంతకుమించి ఆసక్తి రేపగల మరో ఫైల్స్‌ వెలుగులోకి రానున్నాయి. గ్రహాంతరవాసులు, అంతరిక్షానికి సంబంధించిన అంతు తెలియని విషయాల తాలూకు పరిశోధనల ఫైల్స్‌ను బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు! 

ఆ ఫైల్స్, వాటి తాలూకు వివరాలను విడుదల చేయాలని సంబంధిత ఫెడరల్‌ ఏజెన్సీలను ఆదేశిస్తానంటూ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ప్రజల్లో నెలకొని ఉన్న ఆసక్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువుల (యూఎఫ్‌ఓ) గురించి అత్యంత సంక్లిష్టమైన, చాలా ఆసక్తికరమైన, ముఖ్యమైన సమాచార ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయాలని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇతర సంబంధిత ఏజెన్సీల చీఫ్‌లను ఆదేశిస్తానంటూ ఆ పోస్ట్‌లో పంచుకున్నారు.

 గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ నేపథ్యంలో ట్రంప్‌ తాజా ప్రకటన వెలువడటం విశేషం. అయితే, ఒబామా అత్యంత రహస్యమైన సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఆయన భారీ తప్పిదానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ బ్రియాన్‌ టైలర్‌ కోహెన్‌ ఇటీవలే ఒబామాను ఇంటర్వ్యూ చేశారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అని కోహెన్‌ ప్రశ్నించగా ఒబామా ఆసక్తికరంగా బదులిచ్చారు. ‘‘ఈ విశ్వం చాలా పెద్దది. 

అనంత విశ్వంలో ఎక్కడో ఓ చోట జీవం ఉండే అవకాశం ఉంటుంది. కానీ సౌర వ్యవస్థల మధ్య చాలా దూరముంది. కనుక గ్రహాంతరవాసులు ఒకవేళ నిజంగానే ఉన్నా వారు మనల్ని సందర్శించే అవకాశం తక్కువ. అయితే నేను అధ్యక్షునిగా ఉండగా గ్రహాంతరవాసులు మనుషులను సంప్రదించారనే ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. గ్రహాంతరవాసులను పట్టి, అమెరికాలోని నెవడాలో ఏరియా 51గా పిలిచే అత్యంత రహస్య సైనిక స్థావరంలో బంధించి ఉంచారన్న వార్తలు కూడా నిజం కాదన్నారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నదీ లేనిదీ తనకూ తెలియదని ట్రంప్‌ కూడా గతంలో పలుమార్లు చెప్పారు.

దశాబ్దాల ఆసక్తి
గ్రహాంతరవాసుల ఉనికిపై మనుషుల ఆసక్తి ఇప్పటిది కాదు. వారు కనిపించారంటూ దశాబ్దాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో చాలావరకు పుకార్లుగానే మిగిలిపోయాయి. భూమికి అవతల జీవముందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కాకపోతే అమెరికా గగనతలంపై ఎన్నోసార్లు ఫ్లయింగ్‌ సాసర్లు, యూఎఫ్‌ఓలు సంచరించాయనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. గగనతలంలో గుర్తు తెలియని వస్తువులను చూశామంటూ పలువురు పైలట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. యూఎఫ్‌ఓలపై నాసా దశాబ్దాల పాటు ముమ్మరంగా పరిశోధనలు సాగించింది కూడా. అయితే గ్రహాంతరవాసులు ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలలేదని 2024లో ఓ నివేదికలో నాసా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)