Breaking News

ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం

Published on Mon, 11/11/2024 - 08:04

వాషింగ్టన్‌: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా  ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇదివరకే ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. 

కాగా ట్రంప్‌ తాజాగా పుతిన్‌తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి  ఉక్రెయిన్‌కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని  పేర్కొంది.  

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌కాల్‌
 

మరోవైపు ట్రంప్‌తో ఉక్రెయిన్‌పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా  రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్‌వర్క్‌లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)