ఇదేదో భలే ఉందే.. డ్యాన్స్‌ చూస్తూ ట్రంప్‌ మార్క్‌ స్టెప్పులు

Published on Sun, 10/26/2025 - 13:20

కౌలాలంపూర్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా రోజులు త‍ర్వాత మళ్లీ ఫుల్‌ జోష్‌లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్‌ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్‌ డ్యాన్స్‌(Trump Dance Video) వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆసియాన్‌ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్‌.. ఆదివారం కౌలాలంపూర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ నుంచి కిందకు దిగగానే ట్రంప్‌ రెడ్‌ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.

దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్‌కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్‌ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్‌ తన మార్క్‌ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్‌తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్‌ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్‌.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జపాన్‌ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)