‘ఆహారం’పై  టారిఫ్‌లు రద్దు 

Published on Sun, 11/16/2025 - 04:27

వాషింగ్టన్‌: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్‌), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్‌లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.

 ట్రంప్‌ కఠిన విధానాలపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ట్రంప్‌ దిగివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టారిఫ్‌ల రద్దు ప్రకటన చేసినట్లు సమాచారం. దీనివల్ల స్వదేశంలో ధరలు తగ్గుతాయి. అమెరికన్లకు ఊరట లభించనుంది.  డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్‌ల కొరడా అందుకున్న సంగతి తెలిసిందే.  

ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం  
బీఫ్, కాఫీ, అరటి పండ్లు, అవకాడో, టమాటాలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, కోకోవా, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, వెనిల్లా బీన్స్, జామకాయలు, నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్, జీడిపప్పు, గసగసాలు సహా 100కిపైగా ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ఈ టారిఫ్‌ల రద్దు ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.   
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)