నిరుపేదలుగా మారిన బిల్‌ గేట్స్, ట్రంప్.. ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’

Published on Mon, 04/10/2023 - 08:49

న్యూయార్క్‌: ఆర్టిఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్‌ జర్నీ అనే  కృత్రిమ మేధను వినియోగించి గోకుల్‌ పిళ్లై అనే ఆర్టిస్ట్‌ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు.

బిల్‌ గేట్స్, డొనాల్డ్‌ ట్రంప్, మార్క్‌ జుకర్‌బర్గ్, ఎలన్‌ మస్క్‌ వంటి బిలియనీర్స్‌ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు.  ఈ ఫొటోలను గోకుల్‌ పిళ్లై ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తూ ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్స్‌’ అని క్యాప్షన్‌ ఇవ్వడంతో సోషల్‌ మీడియాలో అవి వైరల్‌గా మారాయి!. 

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్‌ మస్క్‌ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్‌ రిచ్‌గా కన్పిస్తున్నారని ఓ యూజర్  చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు.

కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)