Breaking News

జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్‌

Published on Fri, 03/14/2025 - 11:46

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్‌ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను  ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్‌ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. 

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలు  రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలుయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి మసాచుసెట్స్‌, మేరీలాండ్‌, వాషింగ్టన్‌ కోర్టులు. 

అయితే కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలను నిలుపుదల చేయడం సరికాదని ట్రంప్‌ సర్కార్‌ తరఫున తాత్కాలిక సాలిసిటర్‌ జనరల్‌ సారా హారిస్‌ వాదనలు వినిపించారు. కాబట్టి అది అమలు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం విచారణ వాయిదా పడింది. 

వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను ట్రంప్‌ రద్దు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉంది.  అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు.  పౌరసత్వ రద్దుకు సంబంధించి 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు మూకుమ్మడిగా కోర్టుల్లో పలు దావాలు వేశాయి. కోర్టు జోక్యంతో ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు నిలిచిపోయాయి.

14వ సవరణ ఎందుకు వచ్చిందంటే..
అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. ఈ యుద్ధంలో దాదాపు 6,20,000 మంది మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)