Breaking News

అతిపెద్ద యుద్ధం ఆపేశా!

Published on Wed, 10/01/2025 - 05:31

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఘర్షణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆ రెండు దేశాల నడుమ అతిపెద్ద యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి తేల్చిచెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పారు. మంగళవారం మిలటరీ కమాండర్ల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు.

 యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ తనను ప్రశంసించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అసిమ్‌ మునీర్‌ మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. అసిమ్‌ మునీర్‌ పాకిస్తాన్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ట్రంప్‌ తేల్చిచెప్పారు. 

తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశానని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా భారత్‌–పాక్‌ల యుద్ధమే ఉందన్నారు. భారత్, పాక్‌ ఘర్షణలో ఏడు యుద్ధ విమానాలు నేలకూలాయని వెల్లడించారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం ఇవ్వడం వెనుక అమెరికా ప్రమేయం లేదని, పాకిస్తాన్‌ సైన్యం కాళ్లబేరానికి వచ్చి వేడుకోవడం వల్లే వైమానిక దాడులు నిలిపివేశామని భారత ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)