భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్‌ టీమ్‌ సభ్యుడు రాజీనామా

Published on Fri, 02/07/2025 - 16:09

వాషింగ్టన్‌:ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్‌ నుంచి ఓ ఇంజినీర్‌ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్‌ అనే ఇంజినీర్‌ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్‌ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇలెజ్‌ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్‌ ఇండియా హేట్‌’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్‌-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్‌ బ్యాక్‌ డోంట్‌ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు ఇలెజ్‌ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్‌ డీవోజీఈ కంటే ముందు ఎక్స్‌(ట్విటర్‌)లోనూ ఇలాన్‌ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం​.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్‌ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)