Breaking News

మూడో ప్రపంచ యుద్ధమే.. ట్రంప్‌ వ్యాఖ్యలకు రష్యా వార్నింగ్‌

Published on Thu, 05/29/2025 - 07:20

మాస్కో: అమెరికా, రష్యా మధ్య మాటల మంటలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పాల్గొనకపోవడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించడం తెలిసిందే. ‘నేనే లేకుంటే రష్యా లెక్కలేనన్ని దుస్సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చేది’ అంటూ పుతిన్‌ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్‌ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘నాకు తెలిసిన అతి పెద్ద దుస్సంఘటన ఒక్కటే. మూడో ప్రపంచ యుద్ధం! నా మాటల ఆంతర్యాన్ని ట్రంప్‌ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచం మొత్తాన్నీ యుద్ధంలోకి లాగుతామన్నదే మెద్వెదేవ్‌ ఆంతర్యమని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిజంగా నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలని ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు, ఉక్రెయిన్‌ ప్రత్యేక రాయబారి కీత్‌ కెల్లాగ్‌ విమర్శించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)