Breaking News

వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!

Published on Thu, 01/08/2026 - 21:42

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్‌ను అరెస్ట్‌ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది అమెరికా. ఆపై ఆ దేశపు చమురు నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటాయని.. అదీ నిరవధికంగానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. ఈ పరిణామంపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే..

ఈ భూమ్మీద అత్యధిక చమురు నిల్వలు(సుమారు 300 బిలియన్ బ్యారెల్స్) వెనెజువెలాలోనే ఉన్నాయి. అందునా ఎక్కువగా ఒరినోకో బెల్ట్ ప్రాంతంలో లభిస్తున్నాయి. కానీ, వెనెజువెలాలో లభించే చమురు హెవీ సోర్‌ క్రూడ్‌.. అంటే మందంగా, మరీ చిక్కగా ఉంటుంది. డర్టీ ఆయిల్‌గా ఇక్కడి చమురు నిక్షేపాలకు  ఓ పేరుంది. పైగా ప్రతి బ్యారెల్‌కి ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ కాలుష్యం కలిగిస్తోంది. అలాగే..

ఇంతకాలం వెనెజువెలా చమురును ఆవిరితో కరిగించి.. లైట్ క్రూడ్‌ ఆయిల్‌తో కలిపి అమెరికా, చైనా, ఇండియా వంటి దేశాల రిఫైనరీలకు పంపించి వాడుకున్నారు. కానీ ఇది ఖరీదైనది.. కాలుష్యం ఎక్కువగా కలిగించే ప్రక్రియ కూడా.

కాబట్టి ఎలా చూసుకున్నా ఈ చమురును శుధ్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. దీనికి ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి అడ్డగోలుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి తోడు.. వెనెజువెలాలో ప్రస్తుతం చమురు శుద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాతది. పైగా మీథేన్ లీకేజీలు, అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే.. మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు ప్రమాదకరం కూడా. 

అయితే.. తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికతతో ఉద్గారాలను తగ్గించగలమని అమెరికా అంటోంది. అయినప్పటికీ కూడా అమెరికా చమురు ఉత్పత్తి చేస్తే కూడా పర్యావరణంపై భారీ ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. వెనెజువెలా చమురు మొత్తాన్ని తీయడం అమెరికాకు ఆర్థిక భారమే కాదు.. ప్రపంచ వాతావరణ ప్రతికూల మార్పు మరింత వేగవంతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)