Breaking News

భవిష్యత్తు అగమ్య గోచరం

Published on Sun, 11/30/2025 - 06:08

హాంకాంగ్‌: హాంకాంగ్‌లోని అపార్టుమెంట్‌ సముదాయంలో బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం 128 మందిని బలి తీసుకుంది. మరో 200 మంది వరకు జాడ తెలియడం లేదు. హాంకాంగ్‌లోని మొత్తం 75 లక్షల జనాభాకు గాను ప్రమాదం జరిగిన శివారు టై పొ టౌన్‌లోనే 3 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. 

1948 తర్వాత హాంకాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదమిది. 1980ల్లో నిర్మించిన వాంగ్‌ ఫుక్‌ కోర్టు అపార్టుమెంట్‌ సముదాయంలో 4,600 మంది ఉన్నట్లు అంచనా. తాజా విషాద ఘటనలో 32 అంతస్తులున్న ఈ కాంప్లెక్స్‌లో పైఫ్లోర్‌లలో ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం పడింది. మొత్తం 8 అపార్టుమెంట్లకుగాను ఏడు అపార్టుమెంట్లలో దాదాపు 40 గంటలపాటు మంటలు మండుతూనే ఉన్నాయి. 

విలియం లి కుటుంబం సురక్షితం
సెప్టెంబర్‌ నెలలో తమ అపార్టుమెంట్‌లోని 29వ ఫ్లోర్‌ నుంచి రెండో ఫ్లోర్‌కు మారిన విలియం లి కథ సుఖాంతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుటుంబంలోని మిగతా ముగ్గురూ ఆ సమయంలో వేర్వేరు పనులపై బయటే ఉన్నారు. విలియం లి మాత్రం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటున్నారు.

 పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న అపార్టుమెంట్‌లోకి తిరిగి వెళ్లడం అసాధ్యం, మరి ప్రభుత్వం తమను ఎలా ఆదుకుంటుందన్న ఆలోచన ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. ప్రమాదం జరిగిన రోజు ఏమైందంటే.. ఆ రోజు సాయంత్రం విలియం లికి సెలవు. బయటకు వెళ్లాలని అనుకుంటుండగా ఎన్నడూ లేంది సాయంత్రం 3 గంటలప్పుడు భార్య నుంచి ఫోన్‌ వచ్చింది. తమ అపార్టుమెంట్‌ను మంటలు చుట్టుముట్టాయని ఓ స్నేహితురాలు  చెబితే ఫోన్‌ చేశానంది. 

లి నమ్మలేదు. అంతా బాగానే ఉంది. పొగ లేదు, మంటలూ లేవు ప్రమాదం లేదంటూ బదులిచ్చారు. దాదాపు 8 నిమిషాల తర్వాత ఆయన డోర్‌ తెరిచి చూశారో లేదో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అంతా నల్లగా కనిపించింది. అప్పుడు ఆయన ప్రమాదం శంకించారు. హాల్‌లోకి వెళ్లి చూశారు. పొగ తీవ్రతకు తాళ లేక తిరిగి తన ఫ్లాట్‌లోకి వచ్చేశారు. ఇక తనకు మృత్యు ఘడియలు దగ్గర పడినట్లేననుకున్నారు. ఆ తర్వాత కారిడార్‌ గుండా వెళ్లేందుకు యత్నించారు. 

అక్కడ ఇద్దరు వృద్ధులున్నారు. ఈలోగా ఫైర్‌ ఫైటర్లు నిచ్చెన అందించడంతో ముందుగా ఇద్దరు వృద్ధులు కిందికి దిగేందుకు సాయం చేశారు. ఆ తర్వాత ఫైర్‌ ఫైటర్లు పంపిన నిచ్చెనపైకి ఎక్కారు. కిందికి దిగేలోపు మంటలను ఆయనను దహించి వేయకుండా నీళ్లు చిమ్ముతూనే ఉన్నారు. ఎలాగోలా కిందికి చేరుకున్న లి సజీవంగా బయటపడినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కడే తన కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న భార్య, కూతురు, కుమారుడు కనిపించారు. అప్పటికి సాయంత్రం 5 గంటలైంది. ‘మాలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న హాంకాంగ్‌ ప్రజలకు కృతజ్ఞతలు’అని ఈ కుటుంబం అంటోంది.

మా భవిష్యత్తు ఎలా ఉంటుందో..?
ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లిన 70 ఏళ్ల చాన్‌ తాముండే వాంగ్‌ ఫుక్‌ కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. భారీగా వ్యాపిస్తున్న మంటలను దూరం నుంచి చూసి షాకయ్యారు. అలా చూస్తూ ఉండటం మినహా చేయగలిగిందేమీ లేకుండాపోయింది. ఇలాంటి ప్రమాదాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆమె తెలిపారు. అదృష్టవశాత్తూ ఆమె భర్త ఐఎన్‌ కాంగ్‌ ఆ సమయంలో ఇంట్లో లేరు. చాన్, కాంగ్‌ వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తుంటారు.

 దాదాపు పదేళ్లుగా ఉంటున్న ఆ ఇల్లు ఇప్పుడు నివాస యోగ్యంగా ఏమాత్రం లేదు. ఇప్పుడిక ఏం చేయడమా అన్న ఆలోచన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం వారిని ప్రస్తుతం ఓ హోటల్‌లో ఉంచింది. ‘రెండు రోజులుగా నాకు నిద్రపట్టడం లేదు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. ఏంచేయాలి? ఇవే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలు’అని చాన్‌ అంటున్నారు. ‘ప్రభుత్వం అత్యవసర సాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల నుంచి కూడా వస్తువులు, డబ్బు అందుతూనే ఉన్నాయి. అయితే, భవిష్యత్తు జీవితానికి అవి ఏమాత్రం అక్కరకు వస్తాయనేది తెలీడం లేదు’అని తెలిపారు.  

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు