Breaking News

1,450 అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్‌!

Published on Thu, 07/02/2026 - 08:25

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్‌మిషన్ టవర్‌ను  ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్‌ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ జంట టవర్ పైకి చేరి, ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించింది.

ఈ సాహసం తర్వాత వారు టవర్ కింద ఉన్న ఒక ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నాక, సదరు వ్యక్తి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని తనతో ఉన్న మహిళకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె అంగీకరిస్తూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించి, అతడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
 

సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ హెలికాప్టర్ వెంటనే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో ఆ జంట కిందకు దిగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యూజెర్సీకి చెందిన ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి సాహసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా భవనంలో ఉన్న సందర్శకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్‌’ అతలాకుతలం

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)