Breaking News

ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..

Published on Sat, 05/20/2023 - 17:43

పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో  చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు.  హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు.

ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్‌గాంగ్‌లోనో ఓ ప్లే గ్రౌండ్‌లో పిల్లలు పేరెంట్స్‌ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు.

ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)