Breaking News

ట్రంప్‌కు చుక్కెదురు.. హార్వర్డ్‌కు ఊరట

Published on Fri, 06/06/2025 - 11:57

బోస్టన్‌: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్‌(మసాచుసెట్స్) ఫెడరల్‌ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్‌కు తాత్కాలిక ఊరట లభించింది.

హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్‌ సవాల్‌ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్‌ బర్రౌస్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్‌ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్‌ 16వ తేదీన జరగనుంది.

కాగా.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్‌ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్‌లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్‌లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్‌కి పేరుంది. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్‌ మారిందని ట్రంప్‌ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్‌ డాలర్ల కోత విధించిన ట్రంప్‌ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్‌ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్‌హౌజ్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా.  అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్‌ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. 

అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు.  ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము  చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది.  మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్‌ నిర్ణయాలపై హార్వర్డ్‌ దావా వేసింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)