అమెరికాలో నడి రోడ్డుపై గట్కా విన్యాసాలు..  సిక్కు వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు 

Published on Sat, 08/30/2025 - 06:30

లాస్‌ఏంజెలెస్‌: అమెరికాలో నడి రోడ్డుపై ప్రాచీన యుద్ధ విద్యను ప్రదర్శించిన ఓ సిక్కు వ్యక్తిని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. జూలై 13వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని లాస్‌ఏంజెలెస్‌ పోలీసు విభాగం తాజాగా విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. లాస్‌ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్‌ కామ్‌ అరెనా వద్ద గుర్‌ప్రీత్‌ సింగ్‌(35) వేటకత్తిని పట్టుకుని తిప్పుతుండగా హెచ్చరించామని, లక్ష్య పెట్టకపోగా తమపైకి దాడికి యతి్నంచాడని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడని చెబుతున్నారు. 

పోలీసులు చెబుతున్న వేటకత్తి, పంజాబ్‌ ప్రాచీన యుద్ధ విద్యలో భాగమైన గట్కాలో వాడే రెండంచుల కత్తి. సిక్కు మత పరమైన, సాంస్కృతిక కార్యక్రమాలప్పుడు దీనిని ప్రదర్శిస్తుంటారు. అయితే, షార్టు, తలపాగాను ధరించిన ఓ వ్యక్తి రెండడుగుల పొడవైన కత్తితో బెదిరించాడంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తమ సిబ్బంది రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లారని పోలీసు విభాగం తెలిపింది. 

‘కత్తిని నేలపై పడేసి, లొంగిపోవాలని పదేపదే కోరగా, నిరాకరించిన అతడు కత్తితో నాలుకను కోసుకునేందుకు యతి్నంచాడు. సమీపంలోకి చేరుకుంటున్న పోలీసులపైకి బాటిల్‌ విసిరి, తన కారులో అక్కడి నుంచి తప్పించుకునేందుకు యతి్నంచాడు. పోలీసులు వెంబడించగా నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తూ పలు వాహనాలను ఢీకొట్టాడు. వేగంతో వెళ్తూనే కారులో నుంచి కత్తిని చూబుతూ బెదిరించాడు. కత్తిని విసిరేందుకు యతి్నంచగా కాల్పులు జరపాల్సి వచ్చింది. బుల్లెట్‌ గాయాలైన అతడు అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు’అని పోలీసులు వివరించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)