Breaking News

బాల్కనీకి వేలాడింది.. 

Published on Fri, 12/12/2025 - 06:23

అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్‌ అపార్ట్‌మెంట్‌లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది.

 దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు 
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్‌ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్‌ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్‌పైప్‌లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది.  

పక్కింట్లో ఆపద్బంధువు!
భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్‌ పైప్‌ పట్టుకుని పక్క ఫ్లాట్‌ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్‌ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)