Breaking News

జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్‌కు చైనా కౌంటర్‌

Published on Thu, 09/25/2025 - 07:59

బీజింగ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్‌ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.

చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్‌ యూనియన్‌తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్‌ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్‌ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్‌ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్‌ చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)