Breaking News

మూడోసారి ప్రధానిగా మోదీ..కాళ్ల బేరానికొచ్చిన చైనా?!

Published on Wed, 06/12/2024 - 19:42

భారత్‌ అంటే కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది.  

కేంద్రంలో మూడోవిడత మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం విషయంలో మరింత దూకుడు పెంచింది. వాస్తవాధీనరేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చైనా అక్రమిత టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్చాలని మోదీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది. ఇదే విషయంలో చైనాపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్  విషయంలో చైనా వైఖరిపై ఆగ్రహంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమిత టిబెట్  తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది.

దీనికి తోడు రెండవసారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి సమస్యలను పరిష్కరించడంపై భారత్ దృష్టి సారిస్తుందని జైశంకర్ తెలిపారు.

ఈ తరుణంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్‌తో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని,తమ సరిహద్దు వివాదాలను సక్రమంగా నిర్వహించాలని భారత్‌లోని చైనా రాయబార కార్యలయం ఎక్స్‌ వేదికగా స్పందించింది. మూడో విడత మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.  

చైనా,భారత్‌లు పొరుగు దేశాలు. సంబంధిత సరిహద్దు సమస్యలను సక్రమంగా నిర్వహించాలి. ఈ రెండు దేశాల్లో అభివృద్ది,శాంతికి అనుకూలంగా ఉన్నాం.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది.  
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి