Breaking News

చైనాలో ఉన్నతస్థానాల్లోని 19 మందికి ఉద్వాసన 

Published on Sat, 02/28/2026 - 04:08

బీజింగ్‌: చైనాలోని అధికార కమ్యూనిస్ట్‌ పారీ్టలో శక్తివంతమైన స్టాండింగ్‌ కమిటీ భారీగా ప్రక్షాళన చర్యలను ప్రకటించింది. తొమ్మిది మంది సైనిక అధికారులు సహా మొత్తం 19 మందిని తాజాగా విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన చేసింది. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా అవినీతి ఆరోపణలతో సంబంధమున్న సందర్భాల్లోనే ఇలాంటి తొలగింపు చర్యలను స్టాండింగ్‌ కమిటీ చేపడుతుంది.

 మార్చి 5వ తేదీ నుంచి వార్షిక నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాదాపు 14 ఏళ్లుగా ఎదురులేకుండా అధికారంలో కొనసాగుతున్న అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శత్రువులను తొలగించుకోవడం, విధేయతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 

ఉద్వాసనకు గురైన వారిలో సైన్యంలోని అత్యున్నత విభాగం సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాకెట్‌ ఫోర్స్‌లకు చెందిన అధికారులు..వివిధ ప్రావిన్సులు, ప్రాంతాల ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరితోపాటు మిలటరీ కోర్టు, ప్రెసిడెంట్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ శాఖ మంత్రి వాంగ్‌ కూడా ఉన్నారు. దీంతో, నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 2,878కు తగ్గిందని చెబుతున్నారు. ఈ తొలగింపు ప్రభావం వారం పాటు కొనసాగే పీపుల్స్‌ కాంగ్రెస్‌పై ఏమాత్రం ఉండబోదంటున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)