Breaking News

చైనా గుప్పిట్లో పాక్‌ మీడియా? అమెరికా రిపోర్టులో ఏముంది?

Published on Thu, 10/05/2023 - 12:35

అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా  తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్‌లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. 

ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు  చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్‌లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది. 

ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్‌ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. 

చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్‌ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)