Breaking News

అమెరికా  పొమ్మంటే..  చైనా రమ్మంటోంది

Published on Mon, 09/22/2025 - 05:43

బీజింగ్‌: హెచ్‌–1బీ వీసా వార్షిక రుసుమును పెంచేసి అమెరికా విదేశీ ప్రతిభావంతులను దూరం చేసుకుంటుంటే ఇదే అదనుగా వాళ్లకు చైనా స్వాగతం పలుకుతోంది. కీలకమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌(స్టెమ్‌) కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా తమ కొత్త కే–వీసా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని చైనా ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ మేరకు అక్టోబర్‌ నుంచి కొత్త కేటగిరీ అయిన కే–వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఆదివారం పేర్కొంది. కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకల అడ్మినిస్ట్రేషన్‌ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా సహా పలు సంపన్న దేశాలు స్థానికుల ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిస్తూ వర్క్‌ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో విదేశీ ప్రతిభావంతులను ముఖ్యంగా దక్షిణాసియా యువ ప్రతిభను ఒడిసిపట్టేందుకు చైనా ఇలా కొత్త కేటగిరీ వీసాను తెస్తోంది. 

చైనా లేదా విదేశీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లలో స్టెమ్‌ కోర్సుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఆపై ఉత్తీర్ణత సాధించిన యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులకు కే–వీసాను ఇవ్వనున్నారు. బోధన, పరిశోధనారంగంలో ఉన్న వాళ్లూ కే–వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్‌ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే–వీసాకు జోడించారు.

 హెచ్‌–1బీ వీసా రావాలంటే అమెరికాలోని కంపెనీయే స్వయంగా వీసా దరఖాస్తుదారుడిని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. చైనా కే–వీసాకు అలాంటి కఠిన షరతులు లేవని తెలుస్తోంది. విదేశీయులు చైనాలో విద్య, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతికత, అంకుర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కే–వీసా అనుమతిస్తుంది. ఇన్నాళ్లూ అమెరికాకు పొలోమంటూ వెళ్లిన సృజనాత్మక, ప్రతిభావంత యువతను తమ వైపునకు తిప్పుకోవాలని చైనా అభిలషిస్తోంది.  
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)