Breaking News

అమెరికాకు షాకిచ్చిన చైనా

Published on Wed, 04/09/2025 - 17:10

బీజింగ్‌: అమెరికా- చైనాల మధ్య  ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది.  

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.

 

మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.

కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది.

చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)