Breaking News

క్యూబాలో చైనా గూఢచారులు

Published on Mon, 06/12/2023 - 05:20

వాషింగ్టన్‌: కమ్యూనిస్ట్‌ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్‌ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు.

చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్‌ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు.

అట్లాంటిక్‌ సముద్రం, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్‌ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్‌ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్‌ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)