Breaking News

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

Published on Thu, 07/18/2024 - 09:26

బీజింగ్: చైనాలోని జిగాంగ్‌ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం  14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.

అగ్నిమాపక దళంతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా భవనం దిగువన ఉన్న షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటి? ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తలు తరచూ జరగుతుంటాయి. ఈ ఏడాది మే 20 నాటికి 947 మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40 శాతం మేరకు పెరిగాయన్నారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌, లేదా గ్యాస్ లైన్ల లీకేజీ, నిర్లక్ష్యం మొదలైనవి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు