Breaking News

భూకంపం.. బుల్లి బకాసురుడు

Published on Fri, 06/27/2025 - 15:12

ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్‌ అవుతోంది. 

చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్వింగ్‌యువాన్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. 

ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్‌లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు.  

ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్‌ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. 

నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)