Breaking News

సీఈవోతో సరసాల ఎపిసోడ్‌లో కీలక మలుపు

Published on Fri, 07/25/2025 - 09:33

వాషింగ్టన్‌: ప్రముఖ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ‘​కోల్డ్‌ ప్లే’ ఎపిసోడ్‌లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్‌ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్‌ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్‌ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  

గత బుధవారం మాసెచూసెట్స్‌ స్టేట్‌ బోస్టన్‌లోని గిల్లెట్‌ స్టేడియంలో కోల్డ్‌ ప్లే కాన్సర్ట్‌ జరిగింది. ఆ కాన్సర్ట్‌లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్‌ఆర్‌ హెడ్‌ క్రిస్టిన్ కాబోట్‌లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్‌ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్‌ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో  వారిపై స్పాట్  లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్‌లో   కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.

సంస్థ  ఆస్ట్రానమర్‌ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్‌ఆర్‌ హెడ్  క్రిస్టెన్ కబోట్‌ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్‌ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)