Breaking News

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత.. చంద్ర ఆర్య నామినేషన్‌ దాఖలు

Published on Sat, 01/18/2025 - 08:29

ఒట్టావా: భారత సంతతి, కెనడా ఎంపీ చంద్ర ఆర్య నామినేషన్‌ దాఖలు చేశారు. కెనడా ప్రధాని పదవి రేసులో తాను ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని కన్నడలో ప్రకటించారు.  

ఇటీవల,కెనడాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ట్రూడో తరువాత కెనడా ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్ర ఆర్య ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తాజాగా కెనడా ప్రధాని పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది.

కెనడా ప్రధాని పదవి కోసం పోటీ చేస్తున్నట్లు చంద్ర ఆర్య ఈ నెల ప్రారంభంలో ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘‘భావి తరాల శ్రేయస్సు కోసం ప్రధాని పదవికి పోటీ పడుతున్నాను. నేనెప్పుడూ కెనేడియన్ల శ్రేయస్సు కోసమే కష్టపడ్డా. మన పిల్లల భవిష్యత్‌ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి.

లిబరల్‌ పార్టీ నేతగా ఎన్నికైతే ఆ దిశగా నా నైపుణ్యాలను వినియోగిస్తా’’ అని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘శ్రామిక, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుస్థిర సమాజ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకు నావద్ద అనేక పరిష్కారాలున్నాయి. సాహసోపేత రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదు, అవసరం. ఆ బాధ్యతను స్వీకరించి ప్రధానిగా కెనడాను నడిపించేందుకు ముందుకొస్తున్నా’’ అని చెప్పారు.

 కర్ణాటక టు కెనడా
కర్ణాటకలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామం చంద్ర ఆర్య స్వస్థలం. ధార్వాడ్‌లో ఎంబీఏ చేశారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజ ర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. చిన్న పరి శ్రమలకు నిధులు సమకూర్చే ఆర్థిక సంస్థలో పని చేశారు. తయారీ సంస్థను నిర్వహిస్తూనే పలు దేశాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. హైటెక్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించారు.

 👉చదవండి : గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఆమోదం

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)