Breaking News

రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో?

Published on Mon, 01/06/2025 - 09:30

ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో అధికార లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రూడ్‌ ఇప్పటి వరకు తన భవిష్యత్‌ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు  ట్రూడో తన పదవికి రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని (Canadian Prime Minister) బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ట్రూడో రాజీనామాకు గల కారణాలు తెరపైకి వచ్చాయి. 

ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.

ఇటీవల, ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు.  కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వెలుగులోకి వచ్చిన కెనడా మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి. 

రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ట్రూడో రాజీనామా చేస్తే .. ప్రస్తుత ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో తాత్కాలిక నాయకుడిగా,  ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)