Breaking News

ప్రధాని మోదీతో చర్చలు జరిపా: కెనడా ప్రధాని

Published on Fri, 10/11/2024 - 21:08

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. శుక్రవారం లావోస్‌లో జరిగిన భారత్‌-ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయినట్లు స్వయంగా వెల్లడించారు.

‘‘మా భేటీలో చర్చించిన అంశాల గురించి పూర్తి వివరాలను వెల్లడించలేను. కానీ కెనడియన్ల భద్రత, చట్టబద్ధపాలనను సమర్థిస్తూ కొనసాగించటం తమ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని చాలాసార్లు చెప్పా. అందుకే వాటిపైనే నేను దృష్టి సారించా. కెనడా.. భారత్‌తో తన వాణిజ్య సంబంధాలు, ప్రజలతో సంబంధాలను అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఇరు దేశాల మధ్య పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైనే మేము దృష్టి పెడతాం. తదుపరి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అని అన్నారు. ఇక.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా  ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023, జూన్‌ కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. అయితే.. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. దీంతో ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఆయన ఆరోపణలు చాలా అసంబద్ధమని, కొట్టిపారేసింది. అయితే అప్పటి నుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)