కెనడా తీవ్ర ఆరోపణలు.. లారెన్స్ బిష్ణోయ్ వారి మనిషే..!

Published on Wed, 01/14/2026 - 21:07

కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్‌ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్‌ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే  ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో"  లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్  చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు.
 

అంతేకాకుండా ఈ గ్యాంగ్‌ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు  పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. 

పంజాబ్‌కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్‌ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్‌ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)