Breaking News

‘భారత్‌ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్‌ షాక్‌

Published on Wed, 04/10/2024 - 13:20

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. తమ దేశ ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేయటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  కెనడా ఎ‍న్నికల్లో భారత్‌  జోక్యం చేసుకుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ సీనియర్‌ అధికారులతో కూడిన విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విచారణ కమిషన్‌ కీలక విషయాలు వెల్లడించింది.  కెనడా ఎన్నికల్లో భారత్‌ అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. 

‘2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలు మా దృష్టికి రాలేదు’ అని ఎ‍న్నికల అధికారి దర్యాప్తు కమిషన్‌కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్‌ ఎజెన్సీ కనుకున్నట్లు విచారణ కమిషన్‌ వెల్లడించింది.

ఇక.. 2019, 2121 కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సెర్వీసెస్‌(సీఎస్‌ఐఎస్‌) ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై ప్రతిపక్షాలు దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారంపై ప్రధాని జస్టిన్‌ ట్రూడో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రధాని ట్రూడో చేర్చారు. 

కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకుందని దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసినట్ల మీడియా ద్వారా తెలిసింది. ఆ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తుంది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదు’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ ఫిబ్రవరిలో స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం భారత్‌ విధానం కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)