Breaking News

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం.. యూకే పర్యటనలో ప్రధాని మోదీ సంతకం

Published on Wed, 07/23/2025 - 08:52

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్‌ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.

ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.

భారత్‌-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి.  కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్‌)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్‌-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్‌ బిలియన్‌ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)