3,000 కొత్త కార్లు సముద్రంపాలు! 

Published on Fri, 06/06/2025 - 05:52

యాంకరేజ్‌: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్‌బోట్‌ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే జోడియాక్‌ మేరిటైమ్‌ సంస్థ ఈ ‘ది మార్నింగ్‌ మిడాస్‌’నౌకను నిర్వహిస్తోంది. 

పసిఫిక్‌ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్‌ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్‌ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్‌ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్‌ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి. 

అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్‌ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ మెగాన్‌ డీన్‌ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్‌ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు.  

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)