Breaking News

British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?

Published on Sun, 07/07/2024 - 04:32

లండన్‌:  బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు.

 జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు.

 చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్‌ కోడ్‌ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్‌ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)