Breaking News

లండన్‌-ముంబై ఫ్లైట్‌.. కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన ప్రధాని

Published on Wed, 10/08/2025 - 09:40

బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్‌పిట్‌లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్‌కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. 

లండన్‌ హీత్రూ ఎయిర్‌పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్‌పిట్‌ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్‌కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తా’’  అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు(UK PM In Cockpit Video).

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ రెండ్రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. విజన్‌ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్‌–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్‌.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. 

అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్‌లు రద్దవుతాయి. స్టార్మర్‌ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్‌కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ)యూకే చైర్మన్‌ లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్‌ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి.   

ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లోనే నరకం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)