Breaking News

‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్‌

Published on Thu, 11/06/2025 - 10:18

న్యూఢిల్లీ: హార్యానా ‘ఓట్‌ చోరీ’ ఆరోపణల సందర్భంగా రాహుల్‌ గాంధీ చూపిన ఫొటోపై బ్రెజిలియన్‌ మోడల్‌ లారెస్సా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఈ మోడల్‌ ఫొటోతో ఏకంగా 22 పేర్లు నమోదై ఉన్నాయని రాహుల్‌ గాంధీ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఎన్నికల జాబితాలో ఓ బ్రెజిలియన్‌ మోడల్‌ ఫొటో ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో లారెస్సా ఎక్స్‌ వేదికపై స్పందించారు.
 

రాహుల్‌ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా  స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్‌’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు.
 

ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్  ఇన్‌స్టాగ్రామ్‌లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని  ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.


 

ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్‌ సరికొత్త వాదన

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)