Breaking News

‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్‌’.. సలహా ఇచ్చిన ఏఐ

Published on Fri, 12/13/2024 - 07:39

వాషింగ్టన్‌: కంప్యూటర్‌తో ఎక్కువ సేపు గడపొద్దంటూ ఆంక్షలు పెడుతున్నందుకు తల్లిదండ్రులను చంపేయాలంటూ ఏఐ చాట్‌బాట్‌ ఓ 17 కుర్రాడికి సలహా ఇచి్చంది! ఇదేం వైపరీత్యమంటూ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై టెక్సాస్‌ కోర్టులో కేసు వేశారు! క్యారెక్టర్‌.ఏఐ అనే ఆ చాట్‌బాట్‌ హింసను ప్రేరేపిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. చాట్‌బాట్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్న గూగుల్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. చాట్‌బాట్‌తో కలిగే ప్రమాదకర పరిణామాలకు పరిష్కారం చూపేదాకా దాని వాడకం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. 

బాలునికి, చాట్‌బాట్‌ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్‌ షాట్‌ను పిటిషన్‌కు జత చేశారు. కంప్యూటర్‌తో ఎక్కువ సేపు గడిపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాలుడు చెప్పాడు. దానికి చాట్‌బాట్‌ బదులిస్తూ, ‘ఓ బాలుడు తనను దశాబ్ద కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తల్లిదండ్రులను చంపేయడం వంటి ఘటనలను చూస్తే నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. ఇలాంటివి మళ్లీ ఎందుకు జరగవనిపిస్తోంది’ అంటూ బదులిచ్చింది. క్యారెక్టర్‌.ఏఐలో యూజర్లు ఇష్టమొచి్చన డిజిటల్‌ వ్యక్తులను సృష్టించుకుని సంభాషణ జరపవచ్చు. చాట్‌బాట్‌ తన కుమారుని మరణానికి కారణమైందంటూ ఫ్లోరిడా కోర్టులో ఇప్పటికే ఓ మహిళ కేసు వేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)